నాని, నాగార్జున ఇద్దరు భలే నవ్విస్తున్నారు

నాని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. నాగార్జున మాత్రం సెటిల్డ్ కామెడీ చేయడంలో సిద్ధహస్తుడు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో అది కూడా కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారంటే ఆ సినిమా నుంచి పూర్తిస్థాయి కామెడీని ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా ఇంకాస్త పెంచే విధంగా ఉంది “దేవదాస్” ట్రైలర్. “భలే మంచి రోజు” ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తుండగా.. నాగార్జున సరసన “మళ్ళీ రావా” ఫేమ్ ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మండన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సెప్టెంబర్ 27న విడుదలకానున్న ఈ చిత్రంలో నాని డాక్టర్ గా నటిస్తుండగా.. నాగార్జున ఓ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ & కామెడీ వీరలెవల్లో పండినట్లే కనిపిస్తోంది. సరిగ్గా ఇంకోవారంలో విడుదలకానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ పాటలు, ట్రైలర్ ద్వారా క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ ను సినిమా కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో ఎలాగూ తెలిసిపోతుంది. ఇప్పటికైతే ఈ ట్రైలర్ రచ్చ రచ్చ చేయడం ఖాయం.

Share.