కిక్ ఇచ్చిన దేవదాస్ స్మాల్ పెగ్!

దేవదాస్ సినిమా టైటిల్లోనే ఓ కిక్ ఉంది. ఆనాడు ఆ కిక్ ని అక్కినేని నాగేశ్వరరావు పరిచయం చేస్తే.. అందుకు డోస్ పెంచి ఈనాడు అక్కినేని నాగార్జున అందించబోతున్నారు. నానితో కలిసి డబల్ డోస్ ఇవ్వనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ టైటిల్ తోనే క్రేజ్ అందుకుంది. ఇందులో దేవగా నాగార్జున, దాస్ గా నాని కనిపించబోతున్నారు. ఒకరిది ప్రాణాలు తీసే వృత్తి అయితే.. మరొకరిది ప్రాణాలు పోసే వృత్తి. ఇలా ఇద్దరూ విబ్భిన్నంగా వృత్తిలో ఉండి కలిసి పయనం సాగించడమే ఈ కథ. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని స్మాల్‌ పెగ్‌ పేరుతో నేడు రిలీజ్ చేశారు. చిన్న పెగ్ అయినప్పటికీ బాగా కిక్ ఇచ్చింది.

సోడా కావాలా.. వాటర్ కావాలా.. అంటూ నాగార్జున.. ప్రశ్నించేలోపే నాని రెండు పెగ్గులు తాగేస్తారు. దీంతో “దాసు ఏమిటి సంగతి” అని అడగగా.. నాని అమాయకత్వం చూపులతో నవ్వులు పూయించింది.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

Share.