యువతను రెచ్చకొడుతున్న ‘డిగ్రీ కాలేజీ’ ట్రైలర్..!

‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్.ఎక్స్. 100’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే ఆ చిత్రాల్లో బోల్డ్ నెస్ తో పాటూ ప్రతీ ఒక్కరిని కదిలించే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. ఓ కొత్తరకం ఫీల్ ను కూడా క్యారీ చేసారు ఆ దర్శకులు. కానీ ఆ చిత్రాలు బ్లాక్ బూస్టర్లు అవ్వడానికి గల కంటెంట్ ను పక్కన పెట్టేసి… అందులో ఉన్న బూతులని, రొమాంటిక్ సీన్లనే ప్రధానం చేసుకుంటూ కొంతమంది డైరెక్టర్లు వల్గర్ సినిమాలు తీసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ట్రైలర్ ఒకటి యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తుంది.

degree-college-movie-theatrical-trailer1

degree-college-movie-theatrical-trailer2‘1940లో ఒక గ్రామం’ ‘లజ్జ’ ‘కమలతో నా ప్రయాణం’ వంటి విభిన్న చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు నరసింహ నంది ‘డిగ్రీ కాలేజీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే బోల్డ్ నెస్ రాను రాను మితిమీరిపోతుంది అనే ఫీలింగ్ కలుగక మానదు. ఈ ట్రైలర్ ప్రకారం.. హీరో, హీరోయిన్లు డిగ్రీ చదువుకోవడానికి కాలేజీలో జాయినయ్యి… ఆ చదువు తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ పేరు చెప్పుకుని అన్ని పనులు కానిచ్చేస్తారు. పొలాల్లోనూ, క్లాస్ రూముల్లోనూ, బీచుల్లోనూ అన్ని లొకేషన్లలోనూ హద్దులు మీరిన రొమాన్స్ కలిగిన సీన్లు ఈ ట్రైలర్లో పెట్టేసాడు డైరెక్టర్. ఇక ఆ హీరోయిన్ తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్. ఇక హీరో తండ్రి పేదవాడు. హీరోయిన్ తండ్రే విలన్.. కాబట్టి అతన్ని ఎదుర్కొని వీళ్ళిద్దరూ ఎలా నిలబడ్డారు అనేది మిగిలిన కథ. ఆ రొమాంటిక్ సీన్లు తప్ప ఈ ట్రైలర్లో ఏమాత్రం కొత్తదనం లేదు. ‘చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మినట్టు’.. ‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్.ఎక్స్.100’ వంటి చిత్రాల పేర్లు చెప్పుకుని బోల్డ్ సినిమా తీసేద్దామనుకునే డైరెక్టర్లు.. ఈ సీన్లకే థియేటర్లకు పరిగెత్తుకుని వచ్చే ప్రేక్షకుల కాలం అయిపోయిందని కూడా గమనించాలి. రొమాన్స్, బూతులు ముఖ్యం కాదు సహజత్వం ముఖ్యం అనేది కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share.