‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక అప్పుడే..!

ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా వస్తుండగా.. రెండవ పార్ట్ ‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా రాబోతుందని సమాచారం. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం బాలకృష్ణ కు 103,104 చిత్రాలు కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్య బాలన్, రకుల్, నిత్యా మీనన్, తమన్నా, రానా, కళ్యాణ్ రామ్, సుమంత్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లతో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా రిలీజ్ చేసిన ‘కథానాయకా’ పాటకు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో నిర్వహించనున్నట్టు సమాచారం. డిసెంబర్ 16 లేదా 21 న ఈ వేడుకను నిర్వహించనున్నట్టు టాక్. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ లో 11 పాటలు ఉండబోతున్నాయట.

Share.