దండుపాళ్యం 3

కర్ణాటక రాష్ట్రంలో వరుస దోపిడీలు, మర్డర్లు, మానభంగాలకు పాల్పడిన ఓ గ్యాంగ్ జీవితాలను, వారిని పట్టుకొనేందుకు పోలీసులు పడిన పాట్లను కథాంశంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం “దండుపాళ్యం”. ఆ సినిమాకి ప్రీక్వెల్ “దండుపాళ్యం 2” కాగా.. సీక్వెల్ “దండుపాళ్యం 3”. ప్రీక్వెల్ గతేడాది విడుదలై పరాజయం పాలైంది. మరి ఈ సీక్వెల్ అయినా సక్సెస్ అయ్యిందో లేదో చూద్దాం..!!01

కథ : ‘పార్ట్ 1’లో దండుపాళ్యం గ్యాంగ్ అత్యంత కర్కశంగా, దారుణంగా, నీచంగా దోపిడీలు చేయడమే కాక ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళను ఎలా మానభంగం చేసి వారిని చంపుతున్నారో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అయితే.. అసలు ఫస్ట్ పార్ట్ కి పూర్తి విరుద్ధంగా అసలు దండుపాళ్యం గ్యాంగ్ చాలా అమాయకులని, పొట్టకూటి కోసం బెంగుళూరు తీసుకొస్తే పోలీసులే వారిని కిరాతకులుగా చిత్రించి ఇలా బంధించినట్లుగా తెరకెక్కించారు. ఇక ఈ తాజా మూడో భాగంలో పోలీసుల పాయింటాఫ్ వ్యూలో.. అసలు ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది. వీళ్ళు చిన్నప్పట్నుంచి దొంగలుగా ఎదగడానికి గల కారణాలేమిటి, అందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? అంటూ “దండుపాళ్యం” గ్యాంగ్ చరిత్ర చెప్పుకురావడంతోపాటు, వారికి ఉరిశిక్ష ఎందుకు వేయాలి అనేదానికి రీజనింగ్ ఇచ్చారు.02

నటీనటుల పనితీరు : పొరపాటున పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవికాలేలు గనుక మామూలు బట్టలేసుకొని, కాస్త డీసెంట్ గా కనిపిస్తే.. వీళ్ళేంటీ ఇలా మామూలు మనుషుల్లా మారిపోయారు అని సగటు ప్రేక్షకుడు అనుకొనే స్థాయిలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేశారందరూ. ఇంతకు మించి వాళ్ళ నటన గురించి ఏం చెప్పినా తక్కువే.03

సాంకేతికవర్గం పనితీరు : అర్జున్ జన్యా సంగీతంతో సినిమాలోని ఎమోషన్స్ ను విశేషమైన రీతిలో ఎలివేట్ చేయగా.. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాలోని వైల్డ్ నెస్ ను ఎస్టాబ్లిష్ చేసింది. ముఖ్యంగా లైటింగ్ అండ్ కలర్ టింట్ సినిమా జోనర్ ఏంటో ప్రతి ఫ్రేమ్ లో గుర్తుచేస్తూనే ఉంటుంది. ఎడిటింగ్ మాత్రం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అసలే సెకండాఫ్ లో వీళ్ళంతా అమాయకులు, పోలీసులే వాళ్ళని కిరాతకులుగా చిత్రీకరించారు అని ఎస్టాబ్లిష్ చేయడం, మళ్ళీ సెకండాఫ్ లో సీన్స్ రిపిటీషన్ లేకుండా కొత్త సన్నివేశాలతో మళ్ళీ పోలీస్ పాయింటాఫ్ వ్యూను చూపడం అనేది మైనస్ అనే చెప్పాలి. పాత రెండు భాగాలు చూడకుండా సినిమాలకు వచ్చేవాళ్ళ గురించి తెలియదు కానీ.. సిరీస్ ని, ఆ సిరీస్ కి సంబంధించిన ఇష్యూస్ ని ఫాలో అవుతున్నవాళ్లందరికీ అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.

ఇక డైరెక్టర్ శ్రీనివాసరాజు ఏం చెప్పాలనుకొన్నాడో లాస్ట్ ఫ్రేమ్ వరకూ అర్ధం కాదు. సెకండాఫ్ లో అసలు ఈ దండుపాల్యం గ్యాంగ్ చరిత్ర మొత్తం చెబుతానన్నట్లు మొదలెట్టి 1936లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ను మాత్రమే చూపడం, చిన్నపిల్లల్ని బండబూతులు తిట్టించడం.. పైగా అదంతా నేచురాలిటీ కోసం అన్నట్లుగా కవరింగ్ ఇవ్వడం అనేది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడదు. పైగా.. కేవలం ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే ఎంటర్ టైన్ చేయడం కోసం సినిమా మొత్తం బూతులు, అసభ్యమైన మాటలు, జుగుప్సాకరమైన హత్యలు, మానభంగాలతో నింపేయడం అనేది దర్శకుడి పైత్యానికి నిదర్శనంలా నిలిచింది.04

విశ్లేషణ : సో, శాడిజానికి పైశాచికత్వానికి మధ్యలో వచ్చే భయంకరమైన భీభత్సం తప్ప మరో ఎమోషన్ లేని “దండుపాళ్యం 3” చిత్రాన్ని సున్నిత మానస్కులు చూడకపోవడం సమంజసం.05

రేటింగ్ : 1/5

Share.