ఎన్టీఆర్ సరసన.. డైసీ ఎడ్గార్ జోన్స్.. ఈ భామ ఎవరంటే..?

ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. మొత్తానికి హీరోయిన్ల పేర్లు చెప్పేసాడు జక్కన్న. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో రాంచరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుందని… అలాగే జూ.ఎన్టీఆర్ సరసన ఓ ఇంగ్లీష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చెప్పాడు. రాజమౌళి డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు ప్రకటించగానే అసలు ఎవరు… ఈ భామ అనేదాని పై చర్చమొదలయ్యింది. ఇప్పుడు ఈ పేరుని గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Daisy EdgarJones joins SS Rajamouli's 'RRR' with Jr.NTR 1

ఎంతో పేరుపొందిన నటి అయితే తప్ప రాజమౌళి ఈ హీరోయిన్ ని తీసుకోడని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ఇక డైసీ ఎడ్గార్ జోన్స్ ఓ బ్రిటీష్ హీరోయిన్. గతంలో ఈమె కొన్ని టీవీ సీరియల్స్ లో నటించింది. ‘సైలెంట్ విట్నెస్’ ‘కోల్డ్ ఫీట్’ వంటి వాటిలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘పాండ్ లైఫ్’ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇక ‘డైసీ’ ఓ డ్రామా నటి కూడా. బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈ యువ హీరోయిన్ ‘ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్’ లో చదువుకుంది. ఆ తర్వాత వుడ్ హౌస్ థియేటర్ స్టడీస్ సెంటర్ (వుడ్ హౌస్ డ్రామా కాలేజ్) లో చేరి నటనకు సంబంధించిన కోర్సులు కూడా చేసింది. ఇంత డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ని చూసే జక్కన్న ఈమెను మన ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎంచుకున్నాడు. కొంచెం ఇలియానా పోలికలతో ఉండే డైసీ మన తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Share.