ఉన్నట్లుండి సోషల్ మీడియాలో సాహోను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు!

ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడ్ని కానీ వాడి ఎదుగుదలను కానీ ఓర్వలేని వాళ్ళు అతడి ఎదుగుదలను పతనం చేయడానికి పూనుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. సినిమా ఇండస్ట్రీలో ఆ తోక్కేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఆ -పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

“బాహుబలి”తో ఒక్కసారిగా ఆలిండియా ఫేమస్ అయిపోయిన మన సౌత్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ను కొందరు నార్త్ జనాలు “సాహో సినిమా స్టోరీ ఇదే” అని, ప్రభాస్ సినిమాకి ఫలానా ఫ్లాప్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయనున్నాడని రకరకాల వార్తలను వైరల్ చేయడం మొదలెట్టారు. దాంతో సాహో విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారుపడడం మొదలెట్టారు. ఇదంతా గమనించిన కొందరు విశ్లేషకులు ఇదంతా కామన్ అని, కంగారుపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఆ కొందరికి ఒరిగేది ఏముంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

Share.