ఆ కమెడియన్లు లేకుంటే సినిమా రిజల్ట్ ఏంటో

ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలా కారణాలుంటాయి. కథ, కథనం, సంగీతం, కథానాయకుడి ఫాలోయింగ్-క్రేజ్, కథానాయిక అందాల ఆరబోత ఇలా చాలా ఉంటాయి. కానీ.. కేవలం కామెడీ కారణంగా హిట్టయిన సినిమాలూ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. “అసలు ఆ కమెడియన్ లేకుంటే సినిమా పోయేదిరా” అనే డైలాగ్ ఈమధ్యకాలంలో రెగ్యులర్ గా వింటున్నాం.
ఆ కామెడియన్ల గురించి తెలుసుకొందాం..

1. బ్రహ్మానందం brahmanandamసురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంటుంది, సెకండాఫ్ బాగా స్లో అవుతుంది అన్న డౌట్ వచ్చినప్పుడు ఇమ్మిడియట్ గా స్పెషల్ పోలీస్ గా బ్రహ్మానందం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సెకండాఫ్ లో గనుక బ్రహ్మానందం లేకుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

2. వెన్నెల కిషోర్ Vennela Koshorఈ ఏడాది సైలెంట్ హిట్స్ లో ఒకటిగా “అమీ తుమీ” చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ లు హీరోలుగా నటించినప్పటికీ.. వెన్నెల కిషోర్ లేకుంటే సినిమా కనీస స్థాయి విజయం కూడా సాధించి ఉండేది. అమాయక మేధావి పాత్రలో వెన్నెల కిషోర్ చేసిన హంగామా గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.

3. సప్తగిరి Saptagiriసుమంత్ అశ్విన్ కథానాయకుడిగా రూపొందిన “లవర్స్” సినిమా ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ.. అందులో సప్తగిరి పోషించిన “మగజాతి ఆణిముత్యం” అనే క్యారెక్టర్ మాత్రం అందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది. సినిమా ఫ్లాప్ అని ఆడియన్స్ అప్పుడే ఫిక్స్ అవుతున్న తరుణంలో సప్తగిరి “మగజాతి ఆణిముత్యం” అంటూ నవ్వుల పువ్వులు పూయించాడు.

4. సత్యSatyaఅప్పటివరకూ సత్యను ఒక సైడ్ ఆర్టిస్ట్ గానే చూసినవాళ్లందరికీ “రౌడీ ఫెలో” సినిమాతో షాక్ ఇచ్చాడు సత్య. సినిమా యావరేజ్ గా నిలిచిందంటే అందుకు ఏకైక కారణం సత్య. సినిమాలో మనోడి కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు.

5. షానీShaniఅసలు ఈ ఆర్టిస్ట్ ఎవరనేది చాలామందికి తెలియదు. రాజమౌళి “సై” మొదలుకొని చాలా సినిమాల్లో నటించిన షానీ.. “అలా ఎలా” అనే సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో వేసిన పంచ్ డైలాగులకు, చేసిన కామెడీ ఎపిసోడ్స్ కి జనాలు పొట్ట పట్టుకొని మరీ నవ్వారు.

6. సంతానం Santhanamఈ తమిళ ఆర్టిస్ట్ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఇక్కడ అలీ వలే అక్కడ సంతానం అన్నమాట. ఒక్క సినిమా అని పేరు పెట్టి చెప్పలేకపోయినా.. హీరోల పాత్రలు ఫెయిలైనా కమెడియన్ గా సంతానం మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మనోడి సింగిల్ లైన్ పంచ్ డైలాగులకు విశేషమైన అభిమానగణం ఉంది. అందుకే ఒక పక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. మరోపక్క హీరోగానూ వరుస హిట్స్ అందుకొంటున్నాడు.

7. ప్రియదర్శిPriyadarshiమనోడు చెప్పిన “నా సావు నేను చస్తా, నీకెందుకు” అనే డైలాగుకు థియేటర్ మొత్తం గొల్లన నవ్వింది. “పెళ్ళిచూపులు” ఘన విజయంలో ప్రియదర్శి పాత్ర చాలా కీలకమైనది. తెలంగాణ స్లాంగ్ లో బోయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో ప్రియదర్శి చేసిన హంగామాకి యువత బాగా కనెక్ట్ అయ్యారు.

8. రాహుల్ రామకృష్ణ Rahul Ramakrishna“సైన్మ” అనే షార్ట్ ఫిలిమ్ తోనే ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించిన రాహుల్ రామకృష్ణ రీసెంట్ బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి”లో ఫ్రెండ్ రోల్ లో చెప్పిన డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. “థైస్ అంటే తొడలు కావురా కరీంనగర్” అని హీరో చెప్పినప్పుడు “అసలు కరీంనగర్ మధ్యలో ఎందుకు వచ్చిందిరా” రాహుల్ రామకృష్ణ అమాయకంగా అడిగే ప్రశ్నకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. భవిష్యత్ లో టాప్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ పేరు వినిపించొచ్చు.

Share.