అర్జున్ రెడ్డి కామెడియన్ కి బంపర్ ఆఫర్ దక్కింది

ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ గోల్ రాజమౌళి సినిమాలో నటించడం. ఆయన సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రలో కనిపించినా చాలు అనుకొంటారు స్టార్ హీరోలు సైతం. అయితే.. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ.. “అర్జున్ రెడ్డి”తో ఫామ్ లోకి వచ్చిన రాహుల్ ఇప్పుడు ఆ సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. తెలంగాణ యాస మరియు టిపికల్ కామెడీ టైమింగ్ రాహుల్ సొంతం. ఈ రెండూ నచ్చే రాజమౌళి అతడ్ని తాను తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ అయిన “ఆర్ ఆర్ ఆర్”లో సెలక్ట్ చేసుకొన్నాడట.

ఇకపోతే.. ఇటీవల “ఆర్ ఆర్ ఆర్” ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రాజమౌళి తదుపరి షెడ్యూల్ కు ఒక నెల బ్రేక్ ఇచ్చాడు. ఈ నెలలోపు రామ్ చరణ్ తన “వినయ విధేయ రామ” సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్స్ ఫినిష్ చేసుకోవడంతోపాటు ఎన్టీఆర్ కూడా ఈ సమయానికి రాజమౌళి చెప్పిన ప్రకారం బాడీ బిల్డ్ చేసుకొంటాడు. మొత్తానికి మెల్లగా స్టార్ట్ అయినా.. సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న “ఆర్ ఆర్ ఆర్” ఎక్స్ ప్రెస్ అప్డేట్స్ ఇరు కథానాయకుల అభిమానులు కూడా ఫుల్ ఖుష్ గా ఉన్నారు.

Share.