తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నాడు. ఆయన చిన్న కూతురు శ్రీజ రెండవ సారి తల్లి కాబోతుంది. శ్రీజ గర్భవతి అయినా విషయాన్నీ ఆమె భర్త కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. అతడి పేస్ బుక్ అకౌంట్ నుండి ‘శ్రీజ కల్యాణ్ బేబీ2 #లోడింగ్’ అంటూ వారిద్దరూ కలసి దిగిన ఒక ఫోటో తో పోస్ట్ ని పెట్టాడు. భార్యతో కళ్యాణ్ షేర్ చేసుకున్న ఆ ఫొటోలో శ్రీజ గర్భవతి అనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. శ్రీజ భర్త కళ్యాణ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది అంతగా కలసి రాలేదు.

ఇక శ్రీజ, కళ్యాణ్ కి 2016 లో వివాహం జరిగింది. శ్రీజకి ఇది రెండవ వివాహం కాగా మొదటి భర్త ద్వారా శ్రీజకి ఒక కూతురు ఉంది. మొదటి భర్తతో విడిపోయినప్పటికీ కూతురి బాధ్యతలు శ్రీజ తీసుకుంది. ప్రస్తుతం శ్రీజ కూతురు తన దగ్గరే పెరుగుతుంది. ఇక ఏదిఏమైనప్పటికీ మెగా ఫ్యామిలిలో మరొక వారసుడో, వారసురాలో రాబోతుందనే సంతోషం వారి కుటుంబంలో ఉంది.

sreeja-with-kalyan-dhev

Share.