బాహుబలికి చిరు చెక్ పెట్టాడా???

టాలీవుడ్ లో చిరు రీ-ఎంట్రీ ఈరోజే….ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ తన 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు….అయితే దాదాపుగా మన ఇరు రాష్ట్రాలలోని 2300 పై చిలుకు థియేటర్లలోవిడుదల అయిన నేపధ్యంలో ‘ఖైదీ’ మ్యానియాతో టాలీవుడ్ షేక్ అవుతోంది. కేవలం మెగా ఫ్యాన్స్ దృష్టి మాత్రమే కాకుండా ట్రేడ్ పండిట్స్ నుంచి తెలుగు ప్రేక్షకులు అందరి దృష్టి ఈ ‘ఖైదీ’ పై పడటంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈమూవీ తొలిరోజు ‘బాహుబలి’ పేరిట ఉన్న తోలి రోజు రికార్డు 22.4 కోట్ల షేర్ బ్రేక్ చేయడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం….ఇరు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలకు సంబంధించిన థియేటర్స్ లో ఈరోజు ఏఒక్క షోకి ఒక్క టికెట్ కూడ దొరకని పరిస్థితి ఏర్పడింది. నైజాంతో పాటు ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ కృష్ణా నెల్లూరు సీడెడ్ ఇలా అన్ని ఏరియాల నుంచి అందుతున్న రిపోర్టుల ప్రకారం ‘ఖైదీ నంబర్ 150’ తొలిరోజున ఖచ్చితంగా 25-28 కోట్ల షేర్ రావడం ఖాయం అని అంటున్నారు.

ఇక ఇండియా దాటి బయటకు వెళ్ళినా అదే పరిస్థితి నెలకొంది….అమెరికాలో ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలకు వస్తున్న స్పందన చూసి అందరూ షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని 92 ప్రాంతాలలో వేసిన ఈ ప్రీమియర్ షోలు వల్ల ఈ మూవీకి అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా కలక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ఊపు చూస్తుంటే సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అని అంటున్నారు మెగా అభిమానులు….రికార్డుల పరంగా ‘ఖైదీ’ ‘బాహుబలి’ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ‘శ్రీమంతుడు’ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. అయితే పబ్లిక్ టాక్ మాత్రం కాస్త మిక్స్డ్ గా రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అప్పుడే అంచనా వెయ్యలేం అని అంటున్నారు ట్రేడ్ పండితులు…ఇక మరో పక్క రేపు మరో పెద్ద సినిమా ఉండడంతో ఏం జరుగుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.