ఆ విషయంలో తారక్ వెనుకే చిరంజీవి

సింహాద్రి సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సీనియర్ హీరోల రికార్డులను తిరగరాశారు. తాజాగా జనతా గ్యారేజ్ మూవీతో అన్ని రికార్డులకు రిపేర్ చేశారు. కొత్త రికార్డులను నెలకొల్పారు. వాటిలో ఒకటి అత్యధిక ప్రీమియర్ షోలు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు  కర్ణాటక స్టేట్ లో 24 ప్రీమియర్ షోలు వేశారు. ఒక తెలుగు చిత్రానికి పొరుగు రాష్ట్రంలో ఇన్ని  ప్రీమియర్ షోలు వేయడం ఇదే తొలిసారి. అయితే తారక్ పేరిట ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాలని మెగాస్టార్ చిరంజీవి బరిలోకి దిగారు.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానరులో నిర్మించిన ఖైదీ నంబర్ 150 ఫిల్మ్ ని  తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక లోను అత్యధిక ప్రీమియర్ షోలు వేయించాలని అనుకున్నారు. నిర్మాత రామ్ చరణ్ పక్కా ప్లాన్ చేశారు. కానీ కలెక్షన్లు ఆశించినంతగా లేకపోవడంతో 18 షోలకే పరిమితం చేసినట్లు ట్రేడ్ వర్గాలు నేడు వెల్లడించాయి. దీంతో తారక్ 24 తో ముందు ఉంటే, చిరంజీవి 18 తో వెనకే ఉన్నారు. ఈ రికార్డును చిరు తిరగరాయలేకపోయారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.