చిరంజీవి 151 చిత్రం “ఉయ్యాలా వాడ” కాదంట !

ఖైదీ నంబర్ 150 వందరోజులు పూర్తి చేసుకొని మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ ఉత్సాహంతోనే చిరు 151 వ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించారు. 1840 లో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి  జీవిత గాథలో మెగాస్టార్ చిరంజీవి నటించాలని అనుకున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడం,  ఆ స్క్రిప్ట్ మెగాస్టార్ కి నచ్చడం, లాక్ చేయడం జరిగిపోయాయి. అయితే దీనిని సెట్స్ వేయడంలోను, గ్రాఫిక్స్ వర్క్ కి చాలా సమయం అయ్యేలా ఉంది. సో మరీ గ్యాప్ ఎక్కువయితే అభిమానులకు దగ్గరవ్వడం మళ్ళీ కష్టమవుతుందని భావించిన చిరు ఉయ్యాలవాడ వర్క్ ఆపకుండా, మరో ప్రాజక్ట్ ని పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారు.

మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సై అన్నారు. అతను ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఇది కొన్ని రోజుల్లో కంప్లీట్ కానుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇదివరకే కథ చర్చలు ముగిసాయి. 152 సినిమాగా అనుకున్నారు. అదే ఇప్పుడు 151 గా మారుతుందని సమాచారం. ఈ మూవీని నిర్మించడానికి  అల్లు అరవింద్ రెడీగా ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.