ఛలో మూవీ ఫస్ట్ లుక్ టీజర్ | నాగశౌర్య | రష్మిక మండన్న

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. ఈ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఇటీవలే ఛలో అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఛలో చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మీడియా సమావేశంలో నిర్మాతలు తెలియజేశారు.

Share.