ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటీనటులు ఏమన్నారంటే ..!

ఎన్టీఆర్.. వెండితెర మీద ఆ పేరు కనిపిస్తే చాలు విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోతుంది. మాస్ లో అంత క్రేజ్ సంపాదించుకున్నారు. డ్యాన్స్ వేస్తుంటే సీట్ లోంచి లేచి మరీ స్టెప్పులు వేయాల్సిందే. తారక్ తన ఎనర్జీతో ఆడియన్స్ లో ఉత్సాహం నింపుతారు. ఇక డైలాగ్ డెలవిరీ గురించి ఒక్క మాటలో చెప్పలేము. ఆ విషయంలో మహానటుడు నందమూరి తారకరామారావుని గుర్తు చేస్తారు. అందుకే ఎన్టీఆర్ కి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అతని గురించి సినీ స్టార్లు ఏమి చెప్పారంటే.. !!

మహేష్ తర్వాత అతనే Jr Ntr, ఈ తరం హీరోల్లో మహేష్ బాబు తర్వాత నాకు నచ్చే నటుడు ఎన్టీఆర్. – సూపర్ స్టార్ కృష్ణ

ఇష్టమైన హీరో Jr Ntrఇప్పటి హీరోలందరిలో నాకు ఇష్టమైన హీరో తారక్. – సోగ్గాడు శోభన్ బాబు

ఎన్టీఆర్ ల ఉండాలి Jr Ntrతారక్ సినిమాలను చూసిన తర్వాత నేను అతనిలా ఉండాలని అనుకుంటాను. – సల్మాన్ ఖాన్

విజయాలు Jr Ntrఎన్టీఆర్ ని ఎత్తు పరంగా చూస్తే తక్కువగానే కనిపించవచ్చు. కానీ అతను సాధించిన దాన్ని చూస్తే ఎంతో ఎత్తుల్లో ఉన్నాడు. అతన్ని అందుకోవడం కష్టం. – సుదీప్

అమితాబ్ కి సమానం Jr Ntrఅమితాబ్ బచ్చన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల మాదిరిగా డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ కి మంచి పట్టుంది.
– కింగ్ నాగార్జున

డైలాగ్ డెలవిరీలో తప్పు దొర్లదు Jr Ntrడైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ ఎప్పుడైనా పొరపాటు చేస్తాడా? అని కనిపెడుతుంటా . ఇప్పటి వరకు తప్పుగా డైలాగ్ చెప్పలేదు. – డైలాగ్ కింగ్ మోహన్ బాబు

ఎన్టీఆర్ నటించడం ఇష్టంJr Ntrఈ తరం హీరోలందరితో కంటే ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎక్కువ ఇష్టం. – అర్జున్ సర్జ

నేను పెద్ద ఫ్యాన్ Jr Ntrనేను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్. అందుకే అతని ఆటోగ్రాఫ్ తీసుకోవడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. – కుష్బూ

పాత్రకు న్యాయం Jr Ntrనేను రాసుకున్న సన్నివేశాలకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తాడు. – ఎస్.ఎస్.రాజమౌళి

ఏ క్యారక్టర్ కైనా ఎన్టీఆర్ ఫిట్ Jr Ntrఇప్పటితరం నటుల్లో ఏ పాత్రనైనా చక్కగా పోషించగల నటుడు ఎన్టీఆర్ మాత్రమే. – జయసుధ

ఉత్తమ నటుడు Jr Ntrతెలుగులో కాదు.. దేశంలోనే ఉత్తమ నటుడు ఎన్టీఆర్. – సిద్ధార్ద్

నాకు స్ఫూర్తి ఎన్టీఆర్Jr Ntrడైలాగులను చెప్పడంలో నాకు ఎన్టీఆర్ స్ఫూర్తి. – విశాల్

ఎనర్జీ లెవల్స్ సూపర్ Jr Ntrఎన్టీఆర్ లాంటి ఎనర్జీ నాకు ఉండాలని కోరుకుంటాను. – రామ్ చరణ్

రియల్ యాక్టర్ Jr Ntrఎన్టీఆర్ తో నేను నటించేటప్పుడు ఒక స్టార్ తో నటిస్తున్నాను అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఒక నిజమైన నటుడితో స్క్రీన్ ని పంచుకుంటున్నాననే అనుభూతి ఉంటుంది. – ప్రకాష్ రాజ్

స్పాంటేనియస్ యాక్టర్Jr Ntrఎన్టీఆర్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే .. అతను స్పాంటేనియస్ యాక్టర్ – అల్లు అర్జున్

Share.