కెప్టెన్ మార్వెల్

మార్వెల్ సినిమాటిక్ యూనివర్సల్ లో మోస్ట్ పవర్ ఫుల్ సూపర్ హీరో “కెప్టెన్ మార్వెల్”. అందరి కంటే సీనియర్ హీరో అయిన కెప్టెన్ మార్వెల్ ప్రధాన పాత్రగా తెరకెక్కించిన చిత్రం “కెప్టెన్ మార్వెల్”. బ్రీ లార్సన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్ మెంట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేడు (మార్చి 8) విడుదల చేశారు. మరి ఈ సినిమా “ఎవెంజర్స్” చిత్రాల తరహాలో ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..!!

captain-marvel-movie-telugu-review1

కథ: కరోల్ డాన్వర్స్ (బ్రీ లార్సన్) ఒక లేడీ పైలట్. సూపర్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తుంటుంది, కాగా కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా గుర్తుకు వచ్చే తన గతం తాలూకు జ్ఞాపకాలతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా .. అది ఆమె వల్ల కాదు. అయితే ఆమె కొన్ని విపరీతమైన శక్తులను కలిగి ఉంటుంది, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో ఆమెకు తెలియదు.

ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆమెకు యాదృచ్ఛికంగా తన గతం గురించి తెలుస్తోంది. అలాగే కొన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో ఆమెకు ఎవరు మంచి ? ఎవరు చెడు ? అని తెలుస్తోంది. మరి మంచి వాళ్ల కోసం ఆమె ఏం చేసింది ? ఆమెకున్న పవర్ ను సరైన విధంగా ఎలా ఉపయోగించింది ? ఆ క్రమంలో ఆమె విజయం సాధించిందా ? విజయం సాధించిండానికి ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? అనేది “కెప్టెన్ మార్వెల్” కథాంశం.

captain-marvel-movie-telugu-review2

నటీనటుల పనితీరు: ఆస్కార్‌ అవార్డు గ్రహీత బ్రీ లార్సన్‌ ఈ చిత్రంలో సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె ఆ పాత్రలో ఇన్ వాల్వ్ అయిన విధానం, ఈ సినిమా కోసం ఆమె చూపించిన అంకితభావం గురించి మరియు నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వేగంగా వెళుతున్న రైలు పై లార్సన్‌ పోరాడిన సన్నివేశాలు అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.ఆ సన్నివేశాల కోసం లార్సన్‌ చేసిన కఠినమైన కసరత్తులు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి.బ్రీ లార్సన్ తర్వాత సినిమాలో ఆకట్టుకున్న మరో పాత్ర కెప్టెన్ ఫ్యూరీది. ఆ పాత్రలో శామ్యూల్ ఎల్.జాక్సన్ ఒదిగిపోయాడు.

captain-marvel-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు: సాంకేతికంగా మార్వెల్ సినిమాని విశ్లేషించి ఫలానా విషయం బాగుంది అని, ఫలానా విషయం అద్భుతంగా ఉంది అని ప్రత్యేకించి చెప్పలేం. అందుకుకారణంగా మార్వెల్ సంస్థ టెక్నికల్ అంశాల విషయంలో తీసుకొనే స్పెషల్ కేర్.అన్నీ అద్భుతంగా ఈ సినిమాకి సరైన కథనం, దర్శకత్వం లోపించింది. ఆ కారణంగా ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ స్థాయిలో సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా కాస్తా యావరేజ్ గా నిలిచిపోయింది. వచ్చే నెల “ఎవెంజర్స్ ఎండ్ గేమ్” రిలీజ్ కానుంది కాబట్టి.. ఆ సినిమాలో కెప్టెన్ మార్వెల్ పాత్ర చాలా కీలకం కాబట్టి ఆమె పాత్రను ప్రేక్షకులకు చూచాయిగా పరిచయం చేయడం కోసం సినిమా తీసినట్లుగా ఉంటుంది తప్పితే.. సరైన క్యారెక్టరైజేషన్ కానీ.. డెప్త్ కానీ లేవు.

ఆ కారణంగా రెగ్యులర్ మార్వెల్ మూవీస్ ఎంజాయ్ చేసినట్లుగా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేం. పైగా.. తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగోలేదు. డబ్బింగ్ వెర్షన్ డైలాగ్స్ మరీ వెకిలిగా ఉన్నాయి. ఇక సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మన సౌత్ & నార్త్ సినిమాలను తలపిస్తాయి. హాలీవుడ్ లో కూడా ఇంతేనా అని ప్రేక్షకులు ఢీలాపడే స్థాయిలో ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ లు. ఫస్టాఫ్ మొత్తం మార్వెల్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే సరిపోతే.. సెకండాఫ్ లో ఇద్దామనుకున్న ట్విస్ట్ కాస్తా నీరుగారిపోయి ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ చాలా చప్పగా ఉంటాయి.

captain-marvel-movie-telugu-review4

విశ్లేషణ: మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన సినిమా కాబట్టి తెగ ఎంజాయ్ చేసేద్దామని థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఓ మోస్తరుగా ఎంజాయ్ చేయగల చిత్రం “కెప్టెన్ మార్వెల్”.

captain-marvel-movie-telugu-review5

రేటింగ్: 2/5

Share.