పోలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి జనసేన పోటీ చేస్తుండడంతో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులైనవాళ్ళందరూ కూడా జనసేన తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వార్తలు రావడం కామనైపోయింది. ముఖ్యంగా.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనే వార్తలు బాగా వస్తున్నాయి. ఇదివరకే బన్నీవాసు తనకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చినా కూడా ఆయన పేరు మాత్రం వినబడుతూనే ఉంది. ముఖ్యంగా.. జనసేన ఇప్పటికీ రెండు లిస్ట్ లు రిలీజ్ చేసి ఉండడంతో బన్నీవాసు పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

అందుకు కారణం లేకపోలేదు. మెగా ఫ్యామిలీపై లేనిపోని అపవాదులు వచ్చిన తరుణంలో ఆ కుటుంబం తరపున స్టేట్ మెంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బన్నీవాసు. అలాగే.. ఎవరైనా మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే బన్నీ వాసు ఉరుకునేవాడు కాదు. అందుకే అతడు జనసేనలో చేరితో చూడాలన్నది చాలామంది మెగా అభిమానుల ఆకాంక్ష. అయితే.. జనసేనకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కానీ.. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు బన్నీవాసు. వాసుతోపాటు మెగా ఫ్యామిలీకి దగ్గరవాడైన మరో వ్యక్తి ఎస్.కె.ఎన్ కూడా తాను జనసేనకి సపోర్ట్ గా ఉంటాను కానీ.. రాజకీయాల్లోకి మాత్రం రాను అని క్లారిటీ ఇచ్చాడు.

Share.