‘అల్లు అర్జున్ 19’ టైటిల్ అదే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత సంవత్సరం ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ ఇచ్చినా దాన్ని ‘అరవింద సమేత’ సక్సెస్ తో బ్యాలెన్స్ చేసేసాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ చేయబోతున్న సంగతి తెలిసిందే. మే మొదటి వారం నుండీ ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. త్రివిక్రమ్ చిత్రాల్లో ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాల్లో ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బన్నీతో త్రివిక్రమ్ చేయబోయే చిత్రంలోనూ ఫాదర్ సెంటిమెంట్ ఉండబోతుందట.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రానికి సీక్వెల్ అని చాలామంది ఇప్పటికే కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే ఇది కొత్త కథ అట. కానీ ఫాదర్ సెంటిమెంట్ మాత్రం పక్కా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నారట. ఆ టైటిల్ ఏంటి… అంటే… ‘నాన్న.. నేను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే ను తీసుకోబోతున్నారట. గతంలో బన్నీ- పూజా కాంబినేషన్లో ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రం వచ్చింది. ఇందులో మరో హీరోయిన్ గా కేథరిన్ ను కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

Share.