ఆ శృంగార తార చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్స్?

బాలీవుడ్ స్పైసీ బ్యూటీ సన్నీ లియోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి స్టార్ హీరోయిన్స్ దగ్గరి నుండీ యంగ్ హీరోయిన్స్ వరకూ గట్టి పోటీనిస్తూ వస్తుంది. అందులోనూ చేసేది ఐటెమ్ సాంగ్స్ మాత్రమే అయినప్పటికీ పారితోషికం మాత్రం వారితో సమానంగానే అందుకుంటుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె డిమాండ్ ఏంటనేది. ఇక మన టాలీవుడ్ లో కూడా ‘కరెంట్ తీగ’ ‘పీ.ఎస్వి.గరుడవేగ’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు నటించే ఓ చిత్రం ద్వారా మన టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఇద్దరు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

వివరాల్లోకి వెళితే.. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కబోతుందట. ఈ చిత్రం ద్వారా.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సునీల్ ఈ చిత్రంలో నటించాడని అగ్రిమెంట్ పై సంతకం చేశారట. హారర్ అంశాలతో మంచి థ్రిల్ ఇచ్చే విధంగా ఈ చిత్రం రూపొందుతుందట. ప్రసాద్ తాతినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Share.