‘జెర్సీ’ సినిమాలో బ్రహ్మాజీ రోల్ కట్టవ్వడానికి కారణం దిల్ రాజేనట..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా అంటే ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా తన సినిమా మొదలుపెట్టినప్పటి నుండీ ఆర్టిస్టుల విషయంలోనూ, టెక్నిషియన్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాడు. అంతేకదా స్క్రిప్ట్ దశలోనే తనకు నచ్చినట్టు మార్పించుకోవడంతో పాటూ.. ఎప్పటికప్పుడు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని దర్శకుడితో రిపేర్లు చేయించుకుంటూ ఉంటాడట. తను నిర్మించే చిత్రాలకే కాదు.. డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకి కూడా ఇదే జాగ్రత్త తీసుకుంటాడని ఎప్పటినుండో ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రానికి కూడా దిల్ రాజు సలహాలు ఇచ్చాడట. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. అది సినిమాలో కనిపించేది ఒక్క సీన్ మాత్రమే. నిజానికి బ్రహ్మాజీ నటించినవి రెండు సీన్లట. ఈ విషయం ‘జెర్సీ’ అపీప్రిసియేషన్ మీట్లో బ్రహ్మాజీ నే స్వయంగా చెప్పాడు. మరో సన్నివేశం సెకండ్ హాఫ్ లో వస్తుందట. అయితే ఇది దిల్ రాజు ఎడిటింగ్ లో ఎగిరిపోయిందని తెలుస్తుంది. అంతేకాదు సెకండ్ హాఫ్లో దిల్ రాజు చాలా రిపేర్లు చెప్పాడట. సెకండ్ హాఫ్లో క్రికెట్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయట.. అయితే ఇవి ఫిమేల్ ఆడియన్స్ కు కాస్త బోర్ గా అనిపిస్తాయని చెప్పడంతో వాటిని చాలా వరకూ తొలగించారని తెలుస్తుంది. దిల్ రాజు ఇన్వాల్వ్ అవ్వకపోయుంటే… ఆ సన్నివేశాలు మరింత పెరిగేవని… దీంతో రన్ టైం కూడా మూడు గంటలు దాటేసేదని… ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Share.