మహేష్ బాబు కి బోయపాటి కి రాసుకున్న కథ ఏమిటంటే ?

మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ‘స్పైడర్’ సినిమా దాదాపు కంప్లీట్ అయింది. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను ఫిక్స్ చేశారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కానున్న ఈ ప్రాజక్ట్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అంతేనా మహేష్ 26 సినిమా కూడా ఖరారు అయింది. మాస్ డైరక్టర్ బోయపాటి శీను డైరక్షన్లో నటించడానికి ఒకే చెప్పారు. ఈ కథ బోయపాటి స్టైల్లోనే ఊర మాస్ గా ఉందనుకుంటే పొరపాటు పడినట్లే.

ఇదివరకు బోయపాటి టచ్ చేయని సైన్స్ ఫిక్షన్ జాన్రాలో ఈ సినిమా ఉంటుందని తాజా సమాచారం. మహేష్ సైన్స్ ఫిక్షన్ కథతో నాని చేశారు. మళ్ళీ మరోమారు సాహసం చేయనున్నారు.  ప్రస్తుతం బోయపాటి “జయ జానకి నాయక” విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కోసం స్క్రిప్ట్ వర్క్ లోకి దిగనున్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. అనంతరం మహేష్ ని డైరక్ట్ చేయనున్నట్లు ఫిలిం నగర వర్గాల వారు చెబుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.