పాపం ఆయన ఏం చేసినా కలిసి రావడం లేదు!

ఒక మనిషికి అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఎవరైనా పట్టించుకొంటారో లేదో తెలియదు కానీ.. బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం అందరూ నవ్వే వాళ్ళే. ఇప్పుడు మన దర్శక ఘనాపాటి బోయపాటి పరిస్థితి అలానే తయారయ్యింది. అసలే “వినయ విధేయ రామ” సినిమా డిజాస్టర్ అయ్యిందన్న బాధ సరిపోదన్నట్లు ఇప్పుడు ఆయన టి.డి.పి పార్టీ కోసం చేసిన ప్రమోషనల్ యాడ్స్ ఆయనకి కొత్త తలపోట్లు తెచ్చిపెట్టాయి. యాడ్స్ ఎమోషనల్ గా బాగానే ఉన్నప్పటికీ.. అందులోని కంటెంట్ ను అపోజిషన్ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని మరీ ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఆ కారణంగా బోయపాటి మళ్ళీ నవ్వులపాలయ్యాడు.

ఆయన త్వరలోనే బాలకృష్ణ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేసినప్పటికీ.. ఇలా ఒకటికి రెండుసార్లు అవమానపడడం, నవ్వులపాలవ్వడం అనేది ఆయన కెరీర్ కు అంత మంచిదైతే కాదు. ఇండస్ట్రీలోని అన్నీ ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసిన బోయపాటికి ఇప్పుడు టీడీపీ యాడ్స్ పుణ్యమా అని క్యాస్ట్ ను అంటగడుతున్నారు. మరి ఈ రచ్చ ఆయన భవిష్యత్ చిత్రాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

Share.