విశాల్ ఓ కలుపు మొక్క, పందికొక్కంటున్న డైరెక్టర్?

కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం నడిగర్ సంగం అధ్యక్షుడుగా పని చేస్తూ వచ్చాడు. అయితే తెలుగువాడైన విశాల్ నడిగర సంఘంలో బాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తుందని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శరత్ కుమార్ ప్యానెల్ పై విశాల్ ప్యానెల్.. గెలిచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శరత్ కుమార్, రాధికా.. విశాల్ తెలుగువాడని, అతడి కుల ప్రస్తావన కూడా తీసుకువచ్చి చాలా వివాదాలకు తెరలేపారు. అయితే అవన్నీ.. విశాల్ పై ఎఫెక్ట్ చూపించలేకపోయాయి కూడా…!

అయితే ఇప్పుడు మరోసారి నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్ళీ విశాల్ తెలుగోడంటూ కొందరు కోలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. దర్శకుడు భారతీరాజా తాజాగా విశాల్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. “విశాల్ పందికొక్కులా నిర్మాతల మండలిలో చేరాడు. అతన్ని తరిమి కొట్టాలి. మండలిలో మొలిచిన కలుపు మొక్క… పీకేయాల్సిన బాధ్యత మనందరిది. అలాగే చీడపురుగులను కూడా తొలిగించాలి. ప్రస్తుతం నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో ఉండటం బాధగా ఉంది, కాబట్టి ప్రస్తుత నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగ్యరాజ్‌ను గెలిపించాలి” అంటూ విశాల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు భారతీరాజా.

Share.