మహేష్ ఓపికకు హ్యాట్సాఫ్ : భరత్

మహేష్ బాబు తో పనిచేసిన ప్రతి ఒక్కరూ.. డైరక్టర్స్ హీరో అని మహేష్ కి ట్యాగ్ తగిలిస్తారు. ఎందుకంటే మొదటి సినిమా అప్పుడు  డైరక్టర్ మాటని తూచా తప్పకుండా ఎలా పాటిస్తారో.. ఇప్పటికి డైరక్టర్ మాటకి ఎదురు చెప్పరు. వృత్తిని దైవంగా భావిస్తారు. ఆ విషయాన్నీ మరో సారి తమిళ నటుడు భరత్ స్పష్టం చేశారు. ప్రేమిస్తే, బాయ్స్ సినిమాల ద్వారా తెలుగు వారికీ పరిచయమైన ఇతను మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పైడర్ మూవీలో నటించారు. మహేష్ తో కలిసి కొన్ని యాక్షన్ సీన్స్ లో పోటీ పది నటించారు. అతను రీసెంట్ గా సినిమా షూటింగ్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ” మహేష్ తో కలిసి 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను.

ఇది ద్విభాషా చిత్రం కావడంతో ప్రతి సన్నివేశం రెండుసార్లు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా నేను తెలుగు డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువ టేకులు తీసుకున్నాను. అయినా మహేష్ కోప్పడకుండా నన్ను ప్రోత్సహించారు. అతనిలో ఎంత ఓపిక ఉందో ‘స్పైడర్’ షూటింగ్ సమయంలో చూశాను.” అని వివరించారు. ఇంకా సినిమాలో తన రోల్ గురించి మాట్లాడుతూ .. “మురుగదాస్ ‘స్పైడర్’లో నా పాత్ర గురించి చెప్పగానే, నెగటివ్ క్యారక్టర్ అయినప్పటికీ మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను.” అని తెలిపారు. ఇకనుంచి నెగటివ్ రోల్స్ చేయనని భరత్  స్పష్టం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.