డ్యాన్స్ తో అదరగొట్టిన బాలయ్య

నటసింహ బాలకృష్ణ పేరు చెప్పగానే భారీ డైలాగ్స్.. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. బాలయ్య డైలాగ్స్ తో థియేటర్ చప్పట్లతో నిండిపోవడం సర్వ సాధారణం. కానీ బాలయ్య స్టెప్పులతోను విజిల్స్ వేయించారు. ఈ వయసులోనూ అతని జోష్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. వంద సినిమాల తర్వాత బాలకృష్ణ ఫుల్ జోష్ తో దూసుకు పోతున్నారు. గౌతమి శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమాని అత్యంత వేగంగా పూర్తిచేసి ఔరా అనిపించారు. ఈ మూవీ థియేటర్లలో ఉండాగానే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహ సినిమాని పట్టాలెక్కించి సంక్రాంతికి థియేటర్లోకి వచ్చారు.

నిన్న రిలీజ్ అయిన జై సింహ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి పాట “అమ్మకుట్టి” పాటలో బాలకృష్ణ అదిరిపోయే డ్యాన్స్ చేశారు. యాభైయేళ్ల వయసులో ఇరవైఏళ్ళ హీరోయిన్ నటాషా దోషితో కలిసి పోటా పోటీగా స్టెప్పులు వేశారు. ఈ పాటలో బాలయ్య వేసిన కొన్ని మూవ్ మెంట్స్ కి థియేటర్ దద్దరిల్లపోతోంది. నయనతారతోను చాలా జోష్ గా డ్యాన్సులు చేశారు. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంతన్ భట్ తన సంగీతంతో కం‍టతడి పెట్టించారు. సి కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

Share.