బయటికి వచ్చిన కృష్ణుడి గెటప్ లో ఉన్న బాలకృష్ణ ఫోటోలు!

నటసింహ బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన తొలి మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ కాంబోలో వస్తున్న రెండో మూవీ “ఎన్టీఆర్” బయోపిక్. అంచనాలను మించి సినిమా ఉండాలని క్రిష్ కష్టపడుతున్నారు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. గతవారం మనదేశం మూవీ షూటింగ్ సీన్ తో ఈ చిత్ర షూటింగ్ ని మొదలెట్టారు. అప్పుడే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా గురించి తెలుసుకోవాలనే ఆత్రుత పెరిగింది. ఆ ఆత్రుత లీకులకు ప్రాణం పోసింది. ఈ రోజు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ సెట్స్ ఫోటోలు బయటికి వచ్చాయి.

అందులో ఎన్టీఆర్ కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృష్ణుడి గెటప్ లో బాలకృష్ణ ఉండగా… పక్కన మురళీశర్మ చక్రపాణిని పోలిన వేషంలో ఉన్నారు. ఇదే పాత్ర మహానటిలో ప్రకాష్ రాజ్ వేశారు. ఈ ఫోటో చూసి అభిమానులు బహుశా ఇది మాయాబజార్ షూటింగ్ కావచ్చని భావిస్తున్నారు. మహానటి సినిమాలో మాదిరిగానే ఇందులోనూ మాయాబజార్ సన్నివేశాలను మనం చూడవచ్చని తెలుస్తోంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ ని తీసుకున్నారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సచిన్ కెడెకర్ ను ఖరారు చేశారు. ఇలా ఎంతోమంది స్టార్స్ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి సందడి చేయనుంది.

Share.