“సింహ” గా మెప్పించిన నటసింహ బాలకృష్ణ!

నటసింహ.. నందమూరి బాలకృష్ణను అభిమానులు ముందుగా పిలుచుకునే పేరు. సింహా పేరుతో అయన నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే టాలీవుడ్ సింహా గా బాలయ్య పేరుగాంచారు. మళ్ళీ అతను జై సింహగా గర్జించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సింహా టైటిల్స్ తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు..

సింహం నవ్వింది011983 లో వచ్చిన సింహం నవ్వింది లో సింహం బాలకృష్ణ కాదు. నందమూరి తారక రామారావు “నరసింహం” పాత్రలో నటించి మెప్పించారు. ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించినట్లే సింహం టైటిల్ ని బాలయ్య కొనసాగించారు. .

బొబ్బిలి సింహం02ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బొబ్బిలి సింహం . 1994 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

సమరసింహా రెడ్డి03రాయలసీమ పౌరుషాన్ని వెండితెరపై బాలకృష్ణ అద్భుతంగా పలికించిన చిత్రం సమరసింహా రెడ్డి. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న బాలయ్య రికార్డులను తిరగరాసింది.

నరసింహ నాయుడు04బి గోపాల్, బాలయ్య కలయికలో వచ్చిన మరో మూవీ నరసింహ నాయుడు. 8 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 23 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

సీమ సింహం05చిన్ని కృష్ణ స్టోరీ అందించిన సీమ సింహం మూవీలో బాలకృష్ణ నటన అదరహో అనిపించింది. అయితే ఆశించినంత విజయం సాధించలేకపోయింది.

లక్ష్మి నరసింహ 06ప్రేమకథలకు ఫ్యాక్షన్ మిక్స్ చేసే సినిమాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన మూవీ లక్ష్మి నరసింహ . ఇందులో డీసీపీ లక్ష్మి నరసింహ స్వామిగా బాలకృష్ణ అదరగొట్టారు.

సింహ 07నటనకు బాలకృష్ణ గుడ్ బై చెప్పొచ్చు అని విమర్శించేవారికి బాలకృష్ణ సింహా సినిమా ద్వారా సరిగ్గా బుద్ధి చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాలయ్య కెరీర్ కి బూస్ట్ ని ఇచ్చింది.

జై సింహjai-simha-first-lookఏడేళ్ల తర్వాత మళ్ళీ సింహా పేరుతో బాలకృష్ణ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా అనే మూవీ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయి అంచనాలను పెంచేసాయి.

Share.