బైటికొచ్చి చూస్తే ఫుల్ సాంగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ సప్రైజ్ వైరల్ గా మారింది. ఒక్క పాటతోనే.. సినిమాపై అంచనాలను పెంచేశాడు. బైటికొచ్చి చూస్తే పాట డిఫరెంట్ గా ఉండటంతో మ్యూజిక్ ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు. మరీ.. పాటని పవన్ ఎవరితో పాడబోతున్నాడు? ఎవరితో ఆడబోతున్నాడు ? అన్నది ఆసక్తిగా మారింది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ లో పవన్ ఎవరితో బైటికొచ్చి చూస్తారన్నది చూడాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా పవన్ తో జతకట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share.