షో పరంగాను రికార్డు సృష్టించనున్న బాహుబలి 2

రాజమౌళి సినిమాలకు రికార్డులు బద్దలు కొట్టడం కొత్తకాదు.  అయితే సరికొత్త రికార్డులు నెలకొల్పడం కొత్తకాదని మరో మారు నిరూపిస్తుంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన బహుబలి రెండో పార్ట్ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ అందుకొని రికార్డ్ సృష్టించింది. అంతేకాదు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దేశవ్యాప్తంగా ఏడువేల థియేటర్లలో రిలీజ్ అవుతూ సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్న ఈ కళాఖండం.. అమెరికాలోను వెయ్యి థియేటర్లలో రిలీజ్ కాబోతూ అబ్భురపరుస్తోంది. తాజాగా మరో రికార్డ్ నెలకొల్పడానికి సిద్ధమవుతోంది.

ఏప్రిల్ 28 న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో ఐదు షోలు వెయ్యడానికి నిర్మాతలు అనుమతికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒకే అయితే ఒక రోజులో అత్యధిక సార్లు ప్రదర్శించిన సినిమాగా కొత్త రికార్డును చరిత్ర పుటల్లో రాయనుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే సంగతిని తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఉన్నారు. వారి ఉత్సాహాన్ని నీరు కార్చకుండా సినిమాని ఎక్కువమంది చూసేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.