“అమెరికాలో బాహుబలి ఫీవర్” బాగుందే..

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ ని చూసేందుకు తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల ముందు బారులు తీరిన సంగతి తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయాన్నీ తెలుసుకోవాలని రెండేళ్లుగా ప్రపంచంలోని సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. ఈ అంశాన్ని “చికాగో సుబ్బారావు” టీమ్ “అమెరికాలో బాహుబలి ఫీవర్” అనే వీడియో తో చాలా ఫన్నీగా చూపించారు.

ట్రైలర్ చూసినప్పుడు ఆ ఎక్సయిట్మెంట్, పాటలకు ఫిదా అయిపోవడం, కలలోను వాటినే పాడుతూ ఉండడం, సినిమా చూసేందుకు బాస్ కి అబద్ధం చెప్పి బయలు దేరడం.. వంటి అనేక విషయాలు నవ్విస్తున్నాయి. మీరు కూడా ఈ  కామెడీ ఫీవర్ ని మిస్ కాకుండా చూడండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.