బాహుబలి 2 న్యూ టీజర్ | ప్రభాస్ | అనుష్క | రానా

రాజమౌళి, ప్రభాస్ బృందం ఐదేళ్లపాటు పడిన కష్టం వృధాపోలేదు. శోభు, ప్రసాద్ ల నమ్మకం గెలిచింది. అత్యంత సాహోసేపేతమైన ప్రాజక్ట్ విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని బాహుబలి బృందం ఇప్పుడు అనుభవిస్తోంది. గత నెల 28 న 9 వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి కంక్లూజన్ వెయ్యికోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. ఒక తెలుగు చిత్రం వంద కోట్ల మైలు రాయిని అందుకోవడం గొప్పగా భావిస్తుంటాం. అటువంటిది వెయ్యికోట్లను వసూలు చేసి తెలుగువారందరూ గర్వపడేలా చేసింది.

చిత్ర పరిశ్రమల్లో అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ ఖాతాలో ఇప్పుడు అత్యధిక కలక్షన్ సాధించిన భారతీయ మూవీ రికార్డ్ కూడా చేరింది. అంతేకాదు నార్త్ అమెరికాలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించింది. సినిమా విడుదలై పది రోజులు కావస్తున్నా ఇప్పటికీ బాహుబలి థియేటర్ల వద్ద సందడి కొనసాగుతుండడంతో 1500 కోట్లు వసూలు చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సందర్భంగా బాహుబలి టీం కొత్త టీజర్ ని విడుదల చేసారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.