బాహుబలి కంక్లూజన్ మూడు వారాల వసూళ్లు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ విజయవంతంగా మూడో వారాన్ని పూర్తిచేసుకుంది. గతనెల 28 న 9,000 థియేటర్లలో నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వేగంగా ఈ మార్క్ ని దాటిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. నిన్నటి(21 రోజులు) తో ఈ మూవీ 1502 కోట్లు వసూలు చేసి భారతీయ చిత్రాలకు సరికొత్త లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఒక తెలుగు సినిమా ఇన్నికోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వసూళ్ల సాధనలో అలుపు లేనట్టుగా బాహుబలి దూసుకుపోతోంది.

21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి – 2 వసూళ్ల వివరాలు
మనదేశంలో..
నెట్ : 953కోట్లు
గ్రాస్ : 1227 కోట్లు
ఓవర్సీస్ :
గ్రాస్ : 275 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా :1502 కోట్లు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.