అర్జున్ రెడ్డి మూవీ థియేట్రికల్ ట్రైలర్ | విజయ్ దేవరకొండ | షాలిని

పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ సోమరి కుర్రోడిగా నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు.  సందీప్ రెడ్డి  ద‌ర్శక‌త్వంలో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీలో యువ హీరో డిఫెరెంట్ లుక్ తో ఆకర్షిస్తున్నారు.  భ‌ద్రకాళి పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ప్రణ‌య్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశాయి. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చూసేందుకు యువత ఎదురుచూస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.