త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అర్జున్ రెడ్డి హీరో

బోల్డ్ ప్రేమ కథతో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీగా రికార్డ్ కెక్కింది. కలక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో విజయ్ దేవర కొండ స్టార్ హీరో అయిపోయాడు. సినిమాలోనే కాదు .. ఇతనికి రియల్ లైఫ్ లోను మంచి ప్రేమకథ ఉందంట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులతో చెప్పారు. రీసెంట్ గా హన్మకొండ లోని ఒక షో రూమ్ ని ప్రారంభించిన విజయ్ అక్కడ తన ప్రేమ గురించి ఇండైరెక్ట్ గా బయటపెట్టారు. “నేను వరంగల్ కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను” అని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. దీంతో అతని లవ్ స్టోరీ లీకయింది. విజయ్ కాలేజీ లో చదువుతున్న రోజులలోనే వరంగల్ అమ్మాయితో ప్రేమలో పడ్డారంట.

ఆమెకి కూడా విజయ్ అంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆ అమ్మాయి విజయ్ హీరో కావడానికి చాలా ప్రోత్సహించినట్లు హన్మకొండ వాసులు చెప్పుకుంటున్నారు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత తమ ప్రేమ సంగతిని ఇంట్లో వారికీ చెప్పడం, వారు ఓకే చెప్పడం జరిగిపోయాయని టాక్. త్వరలోనే విజయ్ పెళ్లి సంగతి అధికారికంగా బయటికిరానుంది. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో సినిమా చేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి “గీతా గోవిందం” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Share.