హాలీవుడ్ ఆఫర్ అందుకున్న అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్

బేసిగ్గా థియేటర్ ఆర్టిస్ట్ అయిన రాహుల్ రామకృష్ణ సరైన అవకాశాలు రాక, దొరక్క స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండిపోయిన ఈ నటుడు “అర్జున్ రెడ్డి” సినిమాతో కమెడియన్ గా సూపర్ హిట్ కొట్టడమే కాక అనంతరం “గీత గోవిందం, హుషారు” చిత్రాల్లో తన నటనతో, కామెడీ టైమింగ్ తో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారిపోయాడు. సాధారణంగా తెలుగులో సూపర్ హిట్ అయిన కామెడియన్స్ కి తమిళం లేదా హిందీ భాషల్లో అవకాశాలు వస్తుంటాయి. కానీ.. విచిత్రంగా, ఆశ్చర్యకరంగా రాహుల్ రామకృష్ణకు ఏకంగా హాలీవుడ్ నుంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.

ఇండియన్ అయిన ప్రదీప్ కాటసాని తెరకెక్కిస్తున్న హాలీవుడ్ చిత్రం “సిల్క్ రోడ్”లో ఒన్నాఫ్ ది లీడ్ రోల్ కోసం రాహుల్ రామకృష్ణను ఫైనల్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజెప్పాడు. సో, కెరీర్ మొదలెట్టిన కొన్నాళ్లకే హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన రాహుల్ రామకృష్ణ ఇదే ఫామ్ లో దూసుకెళ్తే స్టార్ కాదు ఏకంగా సూపర్ స్టార్ కమెడియన్ అయిపోవడం ఖాయం.

Share.