వీర రాఘవుడు వేసే ఒక్క అడుగు వంద అడుగులతో సమానం!

ఎన్టీఆర్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అరవింద సమేత”. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమా జోనర్ కి తగ్గట్లే ఉరమాస్ యాక్షన్ తోపాటు త్రివిక్రమ్ మార్క్ క్లాస్ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి ట్రైలర్ లో.aravindha-sametha-theatrical-trailer1

అన్నిటికంటే ముఖ్యంగా.. త్రివిక్రమ్ మునుపటి సినిమాల్లో కనబడిన లెక్కకుమిక్కిలి ప్రాశలతో కూడిన పంచ్ లు ట్రైలర్ లో పెద్దగా కనిపించకపోవడం.. ఉన్న సంభాషణల్లో వింటేజ్ త్రివిక్రమ్ కనిపించడంతో గురూజీ అభిమానులందరూ కాలర్ ఎగరేయగా.. “అజ్ణాతవాసి” తర్వాత ఎన్టీయార్ తో సినిమా ఎలా తీస్తాడా అని భయపడిన అభిమానులందరూ ట్రైలర్ పుణ్యమా అని టెన్షన్ నుంచి బయటపడ్డారు.aravindha-sametha-theatrical-trailer2

ట్రైలర్ లో వినబడిన “వయొలెన్స్ మీ డి.ఎన్.ఏ లో ఉంది, ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం” లాంటి సంభాషణలు ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉండగా.. “30 ఏండ్ల నాడు మీ తాత కత్తిపట్టినాడంటే.. అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే.. అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ లాంటిది” అంటూ బామ్మ పాత్ర చెప్పే డైలాగ్ సినిమా కథాంశాన్ని ఎలివేట్ చేస్తుండగా.. “అప్పా.. ఈడ మంది లేదా, కత్తుల్లేవా” అంటూ ఎన్టీయార్ రోషంతో చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ షాట్.aravindha-sametha-theatrical-trailer3

ఇక ఈ ట్రైలర్ లో సర్ ప్రైజ్ ప్యాకేజ్ అంటే పూజా హెగ్డే పాత్ర. ఎన్టీయార్ ను డామినేట్ చేయడానికి ప్రయత్నించడమే కాక సొంత డబ్బింగ్ తో మెప్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా చివర్లో ఎన్టీఆర్ చాలా సెటిల్డ్ గా “సార్ వందడుగుల్లో నీరు పడుతుందంటే నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు? మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి” అని చెప్పిన డైలాగ్ తో సినిమాలో ఎన్టీయార్ సీమలో రక్తపాతాన్ని ఆపడం కోసం ప్రయత్నించే ధ్యేయమున్న వ్యక్తిగా ఎన్టీయార్ కనిపించనున్నాడని స్పష్టమవుతోంది. ఈసారి మాస్ మసాలాతోపాటు హ్యూమన్ ఎమోషన్స్ ను కూడా దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతంగా పండించాడని క్లారిటీ వచ్చింది. ఈ ట్రైలర్ ను కళ్యాణ్ రామ్ విడుదల చేయడం మరో విశేషం.

Share.