విభిన్న పాత్రల్లో అనుష్క ప్రతిభ!

నటన మీద ప్రేమతో సినిమాల్లోకి వచ్చేవారు ఒక టైపు అయితే.. సినిమాల్లో నటించిన తర్వాత నటనపై ప్రేమను పెంచుకునే వారు మరో టైపు. రెండో వర్గానికి చెందిన బ్యూటీ మన స్వీటీ. అందంతో చిత్రాల్లో అడుగుపెట్టి అభినయంతో ఆకట్టుకుంటున్న బెంగుళూరు భామ అనుష్క నేడు (నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్ లో మరిచిపోలేని పాత్రల గురించి ఫోకస్…

సూపర్Super, Anushkaతొలి చిత్రం విషయంలో ఎవరికైనా కొంత ఆందోళనగా ఉంటుంది. అనుష్క మాత్రం సూపర్ సినిమాలో చాలా జాలీగా సాషా పాత్రను పోషించింది. టామ్ బాయ్ లా చక్కగా నటించి చిత్రపరిశ్రమలో సూపర్ గా ల్యాండ్ అయింది.

స్టాలిన్Stalin, Anushkaఅప్పుడప్పుడే సినిమాల్లో హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న అనుష్క చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేయడానికి వెనుకాడలేదు. స్టాలిన్ సినిమాలో “ఐ వన్నా స్పైడర్ మాన్” పాటలో చిరు తో స్టెప్పులు వేసి అదరగొట్టింది.

అరుంధతిArundhati, Anushkaఅనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అరుంధతి. ఇందులో అరుంధతి, జేజెమ్మ గా అనుష్క డ్యూల్ రోల్ చేసి సింగిల్ హ్యాండ్ తో కలక్షన్ల సునామీ సృష్టించింది. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడినట్లు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పారు. అరుంధతి తర్వాత లేడి ఓరియెంటెడ్ మూవీ అవకాశాలు ఎన్ని వచ్చినా, ఒకే తరహా కథలకు పరిమితం కాకూడదని ఒప్పుకోలేదు.

వేదంVedam, Anushkaటాప్ హీరోయిన్ గా పేరుపొందిన తర్వాత కూడా అనుష్క వేశ్య పాత్ర చేయడానికి అంగీకరించింది. అవకాశాలు తగ్గిపోతాయని చిన్న హీరోయిన్లు కూడా భయపడే క్యారక్టర్ ని వేదం మూవీలో చేసి నటిగా నిరూపించుకుంది. మనసున్న సరోజగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

బాహుబలిBahubali, Anushkaహీరోయిన్ అంటే స్కిన్ షోకు మాత్రమే పరిమితం కాదని అనుష్క బాహుబలి చిత్రం ద్వారా నిరూపించింది. ఇందులో డీ గ్లామరైజ్ పాత్రలో నటించి మెప్పించింది. దేవసేనగా ఆమె అభినయం అద్భుతం.

రుద్రమ దేవిRudramadevi, Anushkaమహిళలు స్ఫూర్తిగా తీసుకునే ధీర వనిత రుద్రమ దేవి. ఆమెను తెలుగుప్రజలు అనుష్క రోపంలో చూసుకున్నారు. రుద్రమదేవి మూవీలో స్వీటీ చూపించిన రాజసానికి ఎన్నో అవార్డులు ఆమెకు సలాం చేసాయి.

సైజ్ జీరోSize Zero, Anushkaహీరోయిన్ గా కెరీర్ ని ఎంచుకున్న భామలు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక కేజీ పెరిగినా విలవిలలాడిపోతారు. అనుష్క మాత్రం బాధపడలేదు. సైజ్ జీరో సినిమాకోసం ఏకంగా ఆమె 20 కిలోల బరువు పెరిగారు. చిత్రపరిశ్రమలో ఎవరూ చేయని సాహసం చేసి అభినందనలు అందుకున్నారు.

ఓం నమో వెంకటేశాయOm Namo Venkatesaya, Anushkaఅనుష్క మరో సారి గుర్తిండిపోయే పాత్ర చేసింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ మూవీలో వెంకటేశ్వర స్వామి మహా భక్తురాలు కృష్ణమ్మ గా నటిచింది. ఈ చిత్రంలోని ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది.

Share.