మళ్ళీ అనుష్క దగ్గరకే వచ్చిన క్రేజీ ఆఫర్..!

తెలుగు తమిళ భాషల్లో నయన్,అనుష్క లు అగ్ర కథానాయికలుగా చాలామణీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనుష్కను సంప్రదించగా ఆమె తిరస్కరించిందనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అదే అవకాశానికి ఓకే చెప్పిందట. క‌ల్కి ర‌చించిన `పొన్నియ‌న్ సెల్వన్‌` అనే పుస్త‌కం ఆధారంగా మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ నటీనటులతో పాటూ మిగిలిన బాషా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన న‌టులు కూడా నటించబోతున్నారు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, విక్ర‌మ్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌యం ర‌వి, కీర్తి సురేష్ వంటి క్రేజీ న‌టులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇదే క్రమంలో న‌య‌న‌తారను కూడా ఎంచుకున్నారు. అయితే ఆమె ప్ర‌స్తుతం ర‌జినీకాంత్‌, విజ‌య్ సినిమాలతో బిజీగా ఉండ‌డం వ‌ల్ల డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదట. ఇందుకోసమే ఆమె స్థానంలో అనుష్క‌ను తీసుకున్నారని తెలుస్తోంది. న‌య‌న‌తార కంటే ముందు అనుష్క‌కే ఈ ఆఫర్ వచ్చిందట కానీ నో చెప్పింది దీంతో న‌య‌న‌తారను తీసుకున్నారు. కానీ ఇప్పుడు నయన్ తప్పుకోవడంతో మళ్ళీ అనుష్క‌నే సంప్రదించారు. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఆఫర్ చేయడంతో అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Share.