మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్న అనుష్క..!

కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలే చేసేది అనుష్క. ఎప్పుడైతే ‘అరుంధతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుందో అప్పటి నుండీ కధకి ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది మన స్వీటీ. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ ప్రకారం… ‘సైలెన్స్’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో మైఖేల్ మాడిసన్ అనే హాలీవుడ్ నటుడితో పాటు, అంజలి .. షాలిని పాండే .. మాధవన్ .. సుబ్బరాజు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఇక ఈ చిత్రంలో అనుష్క ‘ఎన్.ఆర్.ఐ’ యువతిగా కనిపించబోతుండగా…హీరోయిన్ అంజలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించబోతుందని తెలుస్తుంది. మార్చి నుదనీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించనున్నారట. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘కోన ఫిల్మ్ కార్పొరేషన్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ కలిసి నిర్మిస్తున్నారు. అనుష్క, మాధవన్ కి గల క్రేజ్ ని దృష్టిలోపెట్టుకుని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Share.