దర్శకుని వల్ల చాలా నష్టపోయిన అనుష్క!

స్వీటీ అనుష్క వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఇల్లు, షూటింగ్ అనే రీతిలోనే నడుచుకుంటారు. డబ్బు కంటే కథలో తన క్యారక్టర్ ప్రాధాన్యతను బట్టే సినిమాకి ఒకే చెబుతుంటారు. బాహుబలి చిత్రాల తర్వాత అనేక ఆఫర్లు వచ్చినా.. నచ్చిన కథకోసం ఎదురుచూసి భాగమతి అనే సినిమాని చేశారు. ఇది కూడా సూపర్ హిట్. ఈ సినిమా రిలీజ్ అయి ఆరు నెలలలు గడిచిపోయింది. అయినా ఆమె ఒక సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. రోజుకి లక్షల్లో పారితోషికం అందుకునే ఈ నటి ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం అనేక అనుమానాలకు దారి తీసింది.

అలాగే ఆర్ధికంగానూ నష్టాన్ని కలిగించింది. ఇందుకు ప్రధాన కారణం గౌతమ్‌మీనన్‌ అని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అతన్ని నమ్మి మోసపోయిందని చెప్పుకుంటున్నారు. బాహుబలి తర్వాత గౌతమ్ మీనన్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పిందంట. అది మొదలయేసరికి ఆలస్యం కావడంతో భాగమతి చేశారు. ఈ సినిమా తర్వాత వెంటనే గౌతమ్ మీనన్ ప్రాజక్ట్ ప్రారంభమవుతుందనుకుంటే వాయిదా పడుతూ వస్తోంది. అందువల్ల వచ్చిన ఆఫర్లకు నో చెప్పిందంట. చివరికి గౌతమ్ సినిమా క్యాన్సిల్ అయిందని తెలిసింది. అందుకే  చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Share.