మరో ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క?

‘భాగమతి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం అనుష్క తన శరీర బరువును కూడా తగ్గించుకొని స్లిమ్ గా మారింది. మాధవన్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత అనుష్క ఏ చిత్రంలో నటిస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే అనుష్క ఓ స్పానిష్ రీమేక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘జూలియాస్ ఐస్’ అనే థ్రిల్లర్ సినిమా రీమేక్ లో అనుష్క నటించబోతుందట. కబీర్ లాల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఈ చిత్రంలో కూడా అనుష్క డ్యుయల్ రోల్ పోషిస్తుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందట.

Share.