ఇద్దరమ్మాయిలకు “హలో” చెబుతున్న అఖిల్

పరిచయ చిత్రంతో జీవితంలో మర్చిపోలేని ఫ్లాప్ ను చవిచూసిన అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘హెల్లో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫస్ట్ సినిమాకి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ లుక్ మొదలుకొని టైటిల్ వరకూ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. రెగ్యులర్ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ ను సినిమాలో పెట్టుకోవడం వల్ల వాళ్ళు తనను డామినేట్ చేసే అవకాశాలున్నాయని కొత్తమ్మాయి కళ్యాణి ప్రియదర్శినిని కథానాయికగా ఎంచుకొన్నాడు. ఇప్పుడు మరో హీరోయిన్ కు సినిమాలో అవకాశం ఉండడంతో.. కళ్యాణి వలే ఎలాంటి స్టార్ డమ్ లేని మరో మలయాళ ముద్దుగుమ్మ నివేదితా సతీష్ ను కథానాయికగా ఎంచుకొన్నాడు.

అయితే.. నివేదితా సతీష్ ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటిస్తుందా లేక మరేదైనా కీలకపాత్ర పోషిస్తుందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే.. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని “హలో ట్రైలర్”ను విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.