తారలతో క్రేజ్ పెంచుకుంటున్న సావిత్రి బయో పిక్ మూవీ!

మహానటి సావిత్రి జీవితాన్ని మొత్తం సినీ రంగానికే అంకితం చేశారు. ఆమె జీవితంపై సినిమా తీయాలంటే ఎక్కువగా సినీ స్టార్స్ ఆమె కథలో భాగమవుతారు. అందుకే చిత్ర బృందం మరో హీరోయిన్ ని ఎంపిక చేసింది. అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో  జమున పాత్ర కోసం అర్జున్ రెడ్డి భామ షామిలి పాండే ని తీసుకున్నారు. తాజాగా మాళవిక నాయర్ ని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఎవడే సుబ్రహ్మణ్యం, కల్యాణ వైభోగమే చిత్రాల్లో నటించిన ఈమె కూడా అలనాటి హీరోయిన్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. తారలతో నిండిన ఈ మూవీ అందరినీ అలరిస్తుండడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.