పక్కింటోళ్లు.. పట్టించుకునే వాళ్లేనా ?

ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకరి ఇంటి సంగతులు మరొకరు చెప్పుకుంటుంటారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా కూడా ఉంటారు. అటువంటి వారి వల్ల ఇబ్బందేమీ ఉండదు. కొంతమంది ఉంటారు .. గూడాచారుల్లా మన గురించి తెలుసుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అన్ని రకాలుగా ప్రశ్నలు వేసి వేధిస్తుంటారు. ఈ ప్రశ్నల వల్ల పెద్దలకు చిరాకు రాదేమో గానీ, పిల్లలకు మాత్రం తలనొప్పి వస్తుంది.

నేటి యువత పక్కింటోళ్లు వేసే ప్రశ్నలు ఎంతగా వేదిస్తాయో.. అన్నింటిని ఒకే వీడియోలో తీసుకొచ్చింది మన మహాతల్లి. “పక్కింటోళ్లు” అనే పేరుతో ఈ బుధవారం రిలీజ్ అయిన ఈ వీడియోలో మహాతల్లి ఎదుర్కొన్న ప్రశ్నలు మీరు కూడా ఏదో సమయంలో ఎదుర్కొని ఉంటారు. అందుకే “పక్కింటోళ్ల”కు అందరూ కనెక్ట్ అవుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.