వరుసగా మెగా హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న అనసూయ..!

బుల్లితెర పై వచ్చే ‘జబర్దస్త్’ షోతో బాగా పోపులరయ్యింది హాట్ యాంకర్ అనసూయ. ఈ షోలో ఆమె హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుని కూడా కట్టిపడేసింది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది. ఇప్పటికే ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘సచ్చిందిరా గొర్రె’ ‘కథనం’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రాలు త్వరలోనే విడుదలవ్వనున్నాయని తాజా సమాచారం. ఇక వీటితో పాటూ మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు కొట్టేసిందట.

వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. దీంతో పాటూ అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా అనసూయ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందట. మొదట ఇది మహేష్ బాబు తో చేయాల్సిన ఈ సినిమా ప్రస్తుతం అల్లు అర్జున్ దగ్గరకి వెళ్ళింది. దీంతో వరుసగా మెగా హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే తేజు ‘విన్నర్’, చరణ్ ‘రంగస్థలం’, వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ చిత్రాల్లో నటించిన అనసూయ.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, బన్నీ చిత్రాల్లో కూడా నటించబోతుందన్న మాట..!

Share.