గౌతమి పుత్ర శాతకర్ణిలో యాంకర్ అనసూయ

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి రేపు గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్స్  హేమామాలిని, కబీర్ బేడీ వంటి హేమ హేమీలు నటించిన ఇందులో యాంకర్ అనసూయ కూడా ఛాన్స్ కొట్టేసింది. క్షణం లో విలన్ లాంటి క్యారక్టరా? సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో చేసిన మరదలి పాత్రలో మెరవనుందా? అని ఆలోచనలోకి వెళ్ళకండి. ఆమె ఈ సినిమాలో తెరపైన కనిపించదు. వినిపిస్తుంది. అంటే ఓ పాత్రకు చెప్పిందన్నమాట. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మూవీలో డ‌చ్ మోడ‌ల్ ఫ‌రాకిరిమి ఓ ఇండో గ్రీక్ వారియ‌ర్ క్వీన్ పాత్ర‌ పోషించింది. ఈ విదేశీ  నటి  తెలుగులో సాయిధ‌ర‌మ్ తేజ్ తిక్క సినిమాతో పాటు ధృవ సినిమాలో అర‌వింద్ స్వామికి జోడీగా కూడా న‌టించింది. ఇప్పుడు శాత‌క‌ర్ణిలో ఆమె చేస్తోన్న ఇండో గ్రీక్ వారియ‌ర్ క్వీన్ పాత్ర‌కు అన‌సూయ గొంతు అరువు ఇచ్చింది.

ఈ హాట్ యాంకర్ వేదం మూవీలో హాట్ హాట్ గా కనిపించిన దీక్షాసేథ్ కి డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూవీకి వాయిస్ ఇచ్చింది.  శాత‌క‌ర్ణిలో ఫ‌రా కిరిమి రోల్ నిడివి 15 నిమిషాలే ఉంటుంది. అయినా ఆ పాత్రకు డ‌బ్బింగ్ చెప్పినందుకు అన‌సూయ చాలా ఆనందపడిపోతోంది.  తెలుగు ప్రజలు గర్వించదగ్గ మూవీలో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన క్రిష్ కి కృతజ్ఞతలు అని అనసూయ తెలిపింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.