సెన్సిబుల్ రోల్ కోసం పూర్తి నగ్నంగా నటించిన అమల

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసే హీరోయిన్స్ లలో అమలాపాల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఈ భామ గ్లామర్ డ్రెస్సుల్లో అంతగా కనిపించేది కాదు. వీలైనంత వరకు పక్కింటి అమ్మాయిలా చాలా న్యాచురల్ గానే కనిపించేది. ఇక సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. చీరలో అలాగే లంగా ఓనిలో అమ్మడి లుక్స్ చాలా ఇన్నోసెంట్ గా ఉండేవి. కానీ టెక్నాలజీ లా హీరోయిన్స్ కూడా అప్డేట్ అయితేనే కెరీర్ ని సక్సెస్ ట్రాక్ లో తీసుకెళ్లవచ్చు అని అమలా గ్లామర్ ట్రాక్ లో నుంచి వెళుతోంది. ఇటీవల ఆమె నటించిన కొన్ని సినిమాల్లో గ్లామర్ డోస్ కాస్త గట్టిగా పెంచిన అమలాపాల్.. తన సరికొత్త చిత్రమైన “అడై” కోసం ఏకంగా పూర్తి నగ్నంగా.. అనగా ఒంటి మీద నూలి పోగు లేకుండా నటించడం సరికొత్త సంచలననానికి దారి తీసింది.

amala-paul-role-in-aadai-tamil-movie1

amala-paul-role-in-aadai-tamil-movie2

కార్పొరేట్ కల్చర్ కారణంగా నేటి తరం యువతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమలపాల్ ఒక రేప్ విక్టిమ్ గా కనిపించనుంది. టీజర్ లోనే రెండు న్యూడ్ షాట్స్ తో షాక్ ఇచ్చింది అమలాపాల్. సినిమాలో ఎలాగూ ఇవి బ్లర్ అయిపోవడం ఖాయం. మరి అమలపాల్ ఇంతలా ఒళ్లు దాచుకోకుండా కష్టపడిన ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకొందాం.

Share.