అక్కడ కూడా ఇదే పరిస్థితి!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఆ ఫ్యామిలీ నుంచి దాదాపుగా అరడజనుకు పైగా హీరోలు టాలీవుడ్ లో చక్రం తిప్పాలి అన్న ఆలోచనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు…అయితే అదే క్రమంలో వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుని, సూపర్ సక్సెస్ఫుల్ హీరోలుగా చక్రం తిప్పుతున్నారు…ఇక చెర్రీ కూడా వరుస హిట్స్ అయితే ఇస్తున్నాడు కానీ…ఇప్పటికీ మెగా స్టార్ అన్న స్టార్ డమ్ మీదే ఆధారపడి కధ నడిపించేస్తున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి…ఇదిలా ఉంటే…కుర్ర హీరోలు…సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ్ లు కూడా మెగా స్టాంప్ తో ఒకే అనిపించుకుంటున్నారు.  అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు డ్యాన్స్, యాక్షన్ పరంగా తమదైన వెరైటీ చూపించడం షరా మామూలే…అయితే అందరీలాగా కాకుండా నేను డీఫ్ఫేర్నేట్ అనుకున్నాడో ఏమో…తెలీదు కానీ….అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ మాత్రం కాస్త విటికి భిన్నంగా ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు తన లక్ పరీక్షించుకుంటున్నాడు.

‘గౌరవం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తర్వాత వచ్చిన ‘కొత్తజంట’ చిత్రం కాస్త పరవాలేదు అనిపించింది.  ఇక తర్వాత మనోడు చాలా గ్యాప్ తీసుకొని ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రం ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా మంచి విజయం సాధించినా శిరీష్ కి మాత్రం పేరు తీసుకు రాలేక పోయింది. అయితే ఇక్కడ కధ కలసి రాకపోవడంతో…తెలుగులోనే కాకుండా మళియాళంలో కూడా మంచి పేరు ఉన్న అల్లు అర్జున్….ఇమేజ్ క్యాష్ చేసుకోవాలని మనోడు మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 1971 చిత్రంలో కీలక పాత్రలో పోషించాడు.  అయితే ప్లేస్ అయితే మారింది కానీ…మన వాడి ఫేట్ మారలేదు…కానీ అక్కడ కూడా బ్యాడ్ లక్ వెంటాడంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.  దీంతో తెలుగు లో కాకుండా మళియాళంలో రాణిస్తాడనుకున్న ఆశలు ఆవిరైపోయాయి. పాపం!!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.