వంశీ చిత్రం కోసం బాగా శ్రమిస్తున్న బన్నీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకి కష్టపడుతుంటారు. లుక్ దగ్గర నుంచి డ్యాన్స్ లు, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే తక్కువకాలంలోనే కమర్షియల్ స్టార్ హీరోగా అవతరించారు. అయితే గత చిత్రం డీజే ఆశించినంతగా విజయం సాధించాక పోయే సరికి ఎంతో కసితో ఉన్నారు. కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో  నాపేరు సూర్య సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్  సోల్జర్ గా నటిస్తున్న ఇందులో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ అందాలు ఆరబోయనుంది.

ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్‎ను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ మరోసారి హైదరాబాద్‎లో జరుగుతోంది. భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ కొత్తగా ఉండాలని బన్నీ డూప్ లేకుండా ఎక్కువగా కష్టపడుతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్  సంగీత దర్శక ద్వయం  విశాల్, శేఖర్  సంగీతమందిస్తున్న ఈ సినిమాని మెగా బ్రదర్  కె.నాగబాబు సమర్పిస్తుండడం విశేషం.   రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.ff-ad

Share.