‘అర్జున్ సురవరం’ పైనే లావణ్య ఆశలన్నీ..!

ఒక సినిమా విడుదలవుతుంది అంటే దానికి నాలుగైదు రోజుల నుండీ హీరో హీరోయిన్లు ప్రమోషన్లు మొదలు పెడుతుంటారు. మీడియా కి ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వారి వంతు ప్రమోషన్లు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం రిలీజ్ 15 రోజుల ముందు నుండీ ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. అదే చిత్రమో తెలుసా..? అదేనండీ..! మన నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్‌ సురవరం’ చిత్రం. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రానికి లావణ్య అప్పుడే ప్రమోషన్లు అప్పుడే మొదలు పెట్టేసింది. హీరో నిఖిల్‌ కంటే కూడా లావణ్యనే ఎక్కువగా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తోండడం విశేషం. దీనికి ముఖ్య కారణం లావణ్యకి ఇదే లాస్ట్‌ హోప్‌ అంట. ప్రస్తుతం లావణ్య చేతిలో మరో ఆఫర్ లేదు. వరుసగా ఫ్లాపులు రావడంతో లావణ్యకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. నాని తో చేసిన ‘భలే భలే మగాడివోయ్‌’, నాగార్జునతో చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలతో సాధించిన బ్లాక్ బస్టర్లతో లావణ్య చాలా బిజీ హీరోయిన్ అయిపోయిందని అంతా భావించారు. కానీ ‘మిస్టర్‌’ ‘రాధ’ ‘యుద్ధం శరణం’ ‘ఇంటిలిజెంట్‌’ ‘అంతరిక్షం’ వంటి వరుస డిజాస్టర్లు పడటంతో లావణ్య క్రేజ్ తగ్గిపోయింది. ఈ క్రమంలో ‘అర్జున్‌ సురవరం’ చిత్రం పైనే లావణ్య ఆసలు పెట్టుకుంది. మార్చి 29న విడుదలకాబోతున్న ‘అర్జున్‌ సురవరం’ లావణ్యకి కష్టానికి తగిన ఫలితం ఇస్తుందో లేదో చూడాలి.

Share.